తాగునీటి కోసం ఘర్షణ

Spread the love

Fight For Water 2 were Dead

కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య ఎంతగా వుందో చెప్పలేని పరిస్థితి. తాగునీతి కోసం జరుగుతున్న ఘర్షణల్లో ఏకంగా ఇద్దరు మృత్యు వాత పడ్డారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . కర్నూల్ జిల్లాలో తాగునీటి కోసం తండ్లాటలో భాగంగా దారుణం చోటు చేసుకొంది. మంచినీటి కోసం జరిగిన ఘర్షణలో మంగళవారం నాడు పద్మావతి అనే మహిళ మృతి చెందింది. ఈ జిల్లాలో మంచినీటి కోసం జరిగిన ఘర్షణలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరుకొంది.జిల్లాలోని తుగ్గలి మండలం కదామకుంట్ల గ్రామంలో మూడు రోజులకు ఒక్కసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మంగళవారం నాడు వాటర్ ట్యాంకర్ వచ్చింది. అయితే పద్మావతి అనే మహిళ నివాసం ఉంటున్న కాలనీలో ఓ ఇంటి యజమాని వాటర్ ట్యాంక‌ర్‌ నుండి పైపు వేసుకొని నీటిని వాడుకొంటున్నారు.
ఈ విషయమై పద్మావతి అనే మహిళ ఆ ఇంటి యజమానితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.ఇదిలా ఉంటే 15 రోజుల క్రితం కర్నూల్ పట్టణంలోని లక్ష్మీనగర్‌లో కూడ మంచినీటి కోసం జరిగిన గొడవలో ఓ మహిళ మృత్యువాత పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *