శబరిమలలో మహిళల ప్రవేశంపై తుది తీర్పు రేపే

Final Verdict On Womens Entry Into Sabarimala

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసుల్లో తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయోధ్య భూ వివాద సమస్యను సానుకూలంగా పరిష్కరించిన సుప్రీంకోర్టు గురువారం (14 నవంబర్) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై తుది తీర్పు ఇవ్వనున్నది. చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన నేపథ్యంలో.. ఇక అందరి దృష్టీ అంతే చారిత్రాత్మకమైన శబరిమలపై నిలిచింది. కేరళలోనిఅయ్యప్ప స్వామి సన్నిధానంలోనికి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై ఇదివరకే విచారణను ముగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సారథ్యంలోని ధర్మాసనం.. దీనిపై తీర్పు వెలవరించనుంది. ఈ నెల 17వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో శబరిమల ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించినట్లు కేరళ పోలీస్ డైరెక్టర్ జనరల్ లోక్ నాథ్ బెహరా తెలిపారు. అయిదు దశల్లో 10,017 మంది పోలీసులను భద్రత కోసం మోహరింపజేస్తామని అన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి భద్రతా చర్యలు తీసుకుంటామని అన్నారు. 24 మంది పోలీసు సూపరింటెండెంట్లు, సహాయ ఎస్పీలు, 112 డిప్యూటీ ఎస్పీలు, 264 మంది ఇన్ స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్ స్పెక్టర్లను ఇందులో భాగస్వామ్యులను చేసినట్లు చెప్పారు. 8402 మంది సివిల్ పోలీసు అధికారులను మోహరించామని, వారిలో 307 మంది మహిళా సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.

tags : kerala, shabarimala, women entry, review petitions, supreem court, ranjan gogoi, final judgement, verdict

ఆర్టీసీ సమ్మె కేసు ఈనెల 18కి వాయిదా 

పెట్రోల్ బాటిల్ తో రెవెన్యూ ఆఫీస్ లో హల్ చల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *