ఆయిల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం

19
Fire Accident In Jakarta
Fire Accident In Jakarta

Fire Accident In Jakarta

జకార్తా: ఇండోనేషియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీల్లో ఒకటైన పశ్చిమ జావాలోని బాలోంగన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంతకుముందు అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఈ రిఫైనరీని ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెర్టామినా నిర్వహిస్తోంది. ప్రమాదం కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్రిమాపక దళాలు మంటలు అదుపు చేశాయి. ప్రమాదానికి ముందు భారీ శబ్దం వినిపించిందని, తాను దానిని హరికేన్ అనుకున్నానని స్థానికుడొకరు తెలిపారు. బయటకు వచ్చి చూస్తే మంటలు భారీగా ఎగసిపడుతున్నాయని పేర్కొన్నాడు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెయ్యిమంది స్థానికులను అధికారులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొలుత స్టోరేజీ ట్యాంకులో మంటలు అంటుకోగా, ఆ తర్వాత కంటైనర్స్‌కు పాకినట్టు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక విపత్తు సంస్థ తెలిపింది. మరో 15 మంది గాయపడ్డారని, ముగ్గురి ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు.

International News 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here