పాప్ కార్న్ కూడా మనిషిని చంపేస్తుందా?

Firefighter almost died after popcorn got stuck in his teeth

ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు కూడా ప్రాణం మీదకు తీసుకొస్తాయ్. చిన్నదే కదా అని మనం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాము. పరిస్థితి చేయి దాటాకా లబోదిబోమంటాము. తాజాగా ఓ ఘటన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నోట్లో జరిగిన చిన్న పొరపాటుకు ఏకంగా ప్రాణాలమీదకు వచ్చింది సమస్య. ఆలస్యంగానైనా ముందుగా గుర్తించడంతో బ్రతికాడు ఆ పెద్ద మనిషి. పూర్తి వివరాలలోకి వెళితే….

బ్రిటన్ లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బ్రిటన్ కు చెందిన 41 ఏళ్ల ఆడమ్ మార్టిన్ రెన్డు నెలల క్రితం ఓ షాప్ లో పాప్ కార్న్ కొనుక్కుని తిన్నాడు. అయితే ఎదో ఒక మూలాన పాప్ కార్న్ నోట్లో పంటికి ఇరుక్కుపోయింది. దీంతో అతగాడు ఆ పాప్ కార్న్ ని తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇంతకీ ఆ పాప్ కార్న్ తీసేందుకు అతగాడు ఎం చేశాడో తెల్సా?.. పెన్, టూత్‌పిక్, వైరు ముక్క, నెయిల్‌ కట్టర్‌ ఇలా అనేక వస్తువులతో ఇరుక్కున్న పాప్ కార్న్ ని తియ్యడానికి ప్రయత్నించాడు.దీంతో ఆడమ్ మార్టిన్‌ చిగుళ్లకి ఇన్ఫెక్షన్‌ సోకింది. అదీ కాస్తా పెరిగి పెరిగి ఎడోకార్డిటిస్‌ అనే గుండె వ్యాధికి దారి తీసింది.

ఇక ఆ ఇన్ఫెక్షన్ కాస్త పెద్దదిగా తయ్యారవడంతో అనేక ఇబ్బందులు పడ్డాడు. భయమేసి హాస్పటల్ కి వెళ్లగా షాకిచ్చాడు డాక్టర్. నువ్వు చేసిన పిచ్చిపనులకు నోట్లో ఇన్ఫెక్షన్ కారణంగా గుండె దెబ్బతిందని షాకింగ్ వార్త చెప్పాడు. . చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ రక్త నాళాల ద్వారా గుండెకు చేరి రక్తం గడ్డకట్టిందని వివరించారు. సరైన సమయానికే గుర్తించడంతో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్‌ను తొలగించారు.

Firefighter almost died after popcorn got stuck in his teeth,Adam Martin, 41 years, on death’s door,teeth infection,Heart Infection,Cornwall patient,Popcorn,Dangerous Popcorn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *