శేరిలింగంపల్లిలో తొలి కరోనా పాజిటివ్ కేస్

First Corona Case In Sherlingampally

హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ డివిజన్ అపర్ణ లేక్ బ్రీజ్ టవర్స్ లో నివాసముండే 39 సంవత్సరాల ఓ మహిళ ఈ నెల 12న జర్మనీ నుండి నగరానికి వచ్చింది. హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఆ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం చందానగర్ సర్కిల్ కోవిడ్ 19 బృందం ఆమెను గాంధీ దవాఖాన కి తరలించారు. పరీక్షలు నిర్వహించగా తనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకు సైతం గాంధీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె పరిస్థితి స్థిమితంగా ఉన్నదని వైద్య అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *