FIRST FOLDABLE LAPTOP
- లెనోవో నుంచి తొలి ఫోల్డబుల్ లాప్ టాప్
- 2020 నాటికి అందుబాటులో…
మారుతున్న టెక్నాలజీతోపాటే ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. మడతపెట్టే ఫోన్లు వచ్చాయి. మడతపెట్టే టీవీలు కూడా వచ్చాయ్. తాజాగా మడతపెట్టే ల్యాప్ టాప్ కూడా వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్ టాప్ ను ప్రముఖ టెక్ కంపెనీ లెనోవో రూపొందించింది. మామూలు ల్యాప్ టాప్ తరహాలోనే ఉన్న ఈ డివైస్ ను మధ్యలోకి మడతపెట్టొచ్చు. థింక్ ప్యాడ్ ఎక్స్-1 పేరుతో రూపొందించిన ఈ ఫోల్డబుల్ ల్యాప్ టాప్ ను 2020లో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు లెనోవో వెల్లడించింది. 13.3 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ లాప్ టాప్ ను మధ్యలోకి మడతపెట్టినా, ఎటువంటి అసౌకర్యం కనిపించదు. స్క్రీన్ ను మడిచినా, ముడత కనిపించదు. అంత కచ్చితంగా దీనిని రూపొందించారు. ఇంటెల్ ప్రాసెసర్ తోపాటు యూఎస్ బీ పోర్టులు, ఇన్ ఫ్రా రెడ్ కెమెరా, స్టీరియో స్పీకర్లు, హై రిజల్యూషన్ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోల్డబుల్ ల్యాప్ టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. మరిన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత 2020 ప్రథమార్థంలో ఈ ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి తేవాలని లెనోవో యోచిస్తోంది. ధర విషయంలో ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా, రూ.28 వేల నుంచి 30 వేల మధ్య ఉండొచ్చని అంచనా.
Check the Offers and Discounts OF Branded Laptops