రిపబ్లిక్ డే సేల్స్ ..ఆఫర్లతో అమెజాన్,ఫ్లిప్ కార్ట్

Flipkart Republic Day sale vs Amazon Great Indian sale

ఈ-కామర్స్ సంస్థలు  అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్లకు శుభవార్త అందించాయి . రిపబ్లిక్ డే సేల్‌ పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సదరు సంస్థలు పేర్కొన్నాయి.  స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీగా ధరలను తగ్గించినట్లు ఫ్లిప్‌కార్ట్ సంస్థ తెలిపింది. ఈ రోజు రాత్రి 8 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయని, ఈ రోజు 18-1-20 ఆఫర్ ప్లస్ మెంబర్లకు మాత్రమే అని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. రిపబ్లిక్ డే సేల్‌ ఆఫర్ జవనరి 19 నుంచి 22 వరకు ఉంటుంది. ఈఎంఐపై ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. పాత ఫోన్లను కూడా మార్చుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై రూ. 2000 వరకు తగ్గిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్’ ప్రారంభమైంది. జనవరి 18న ప్రైమ్ మెంబర్స్‌కి సేల్ మొదలవగా, జనవరి 19న అందరికీ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్. స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10% అదనంగా తగ్గింపు లభిస్తుంది.

Flipkart Republic Day sale vs Amazon Great Indian sale,republic day sales, e commerce sites, amazon, flipkart , great indian sale , electronics, mobiles , discounts , offers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *