నలుగురు ఉగ్రవాదుల హతం

7

FOUR TERRORISTS KILLED IN KASHMIR

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు వచ్చిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని దిగ్బంధించి తనిఖీలు ప్రారంభించాయి. భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్‌‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. తొలుత భద్రతాదళాలపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో మన జవాన్లు దీటుగా జవాబిచ్చారు. కాగా, మృతిచెందిన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారు కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని వారు ట్వీట్‌లో వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు..

 

national news