ఫ్రీ స్కూటీ స్కీమ్

Spread the love

FREE SCOOTY SCHEME

పది రూపాయల చీర దొరుకుతుంది అంటే పది కిలోమీటర్ల మేర క్యూలో నిల్చుంటాం.. ఇక ఏకంగా ఉచితంగా స్కూటీ దొరుకుతుంది అంటే ఇక మన వాళ్ళ సంతోషం అంతా ఇంతా కాదు.. అందుకోసం తెగ హడావిడి చేసేసున్నారు . కష్టపడి సంపాదించుకున్న దానిలో పొందే ఆనందం కంటే ఫ్రీగా వచ్చిన దాంట్లో బోలెడంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు .. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త పథకాన్ని ప్రారంభించారని మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ స్కూటీలు పొందాలనుకునేవారు మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరగడంతో లక్షలాది మంది మహిళలు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. పదో తరగతి పాస్ అయి 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకాన్ని పొందడానికి అర్హులు అని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్త పత్రికలలో సైతం ప్రచురితమైంది. ఇక దీంతో ఉచిత స్కూటీ పథకాన్ని పొందడం కోసం మీ సేవ కేంద్రాల వద్దకు మహిళలు పరుగులు పెడుతున్నారు. అయితే ఈ ప్రకటన వైరల్ కావడం, మరియు మీ సేవ కేంద్రాల వద్ద పరిస్థితులు తెలియడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర సర్కార్ అలాంటిది ఏమీ లేదంటూ ప్రకటన చేసింది. కేంద్రం ఎటువంటి పధకం ప్రకటించలేదని , ఉచిత స్కూటీ పథకం ఫేక్ అని , ఇక ఈ వార్తలు అవాస్తవమని , ఎవరు స్కూటీల కోసం మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టంగా చెప్పింది. సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలు గుర్తించే సంస్థ అయిన ‘ ఫ్యాక్ట్ లీ ‘ సైతం ఇదే విషయాన్ని ప్రకటించింది. అయితే ఇదంతా కొందరు ఆకతాయిలు సృష్టించిన ప్రచారం అని తెలియడంతో ఈ విషయంలో మహిళలు అప్రమత్తం చేయడానికి, ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని చెప్పడానికే అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది.

tags : telangana, free scooty scheme, social media, women, queue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *