గ్యాంగ్ లీడర్ బ్యూటీకి సూపర్ ఆఫర్

5
gang leader heroin
gang leader heroin

gang leader heroin

గ్యాంగ్ లీడర్ సినిమాలో సంప్రదాయమైన తెలుగమ్మాయి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ప్రియాంక అరుళ్ మోహనన్. కథకు తగ్గట్టుగా తను పర్ఫెక్ట్ గా యాప్ట్ అయినా.. సినిమా హిట్ కాకపోవడంతో తనకు ఏ మాత్రం ప్లస్ కాలేకపోయింది. అయినా తెలుగులో శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో ఆఫర్ కొట్టేసిది. కాస్త గ్లామర్ యాంగిల్ నూ చూపిస్తే ఇంకా మంచి ఆఫర్స్ వచ్చేవి అని గ్యాంగ్ లీడర్ టైమ్ లో కొన్ని కమెంట్స్ వచ్చాయి. బట్ లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా అమ్మడు ఏకంగా మహాసముద్రంలోకి ఎంటర్ అయింది. యస్.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో రూపొందబోతోన్న ‘మహా సముద్రం’ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఆర్ఎక్స్ 100 తర్వాత ఈ సినిమా కోసం మూడేళ్లుగా చూస్తున్నాడు అజయ్ భూపతి. ఈ మధ్య లో నిర్మాత కూడా మారాడు. ఎంతోమంది హీరోల వద్దకు తిరిగిన అతని కథ ఫైనల్ గా శర్వానంద్ వద్ద ఆగడం విశేషం.

అలాగే సినిమాలో మరో హీరోగా కొన్నాళ్ల క్రితం లవర్ బాయ్ అనిపించుకున్న సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక హీరోయిన్ విషయంలోనూ ఎన్నో వార్తలు వచ్చాయి. మొదట్లో సమంత అనుకున్నారు. తనకు కథ నచ్చినా కాదన్నది అన్నారు. తర్వాత అదితిరావు హైదరి, సాయి పల్లవి, ఐశ్వర్య రాజేశ్ .. ఇలా చాలా పేర్లే వచ్చాయి.  బట్ ఫైనల్ గా ప్రియాంక మోహనన్ సైన్ చేసింది. ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతోంది. మొత్తంగా శ్రీకారం తర్వాత మళ్లీ శర్వానంద్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ప్రియాంక. కాకపోతే తను శర్వాకే పెయిర్ గా నటిస్తుందా.. లేక సిద్ధార్థ్ సరసన నటిస్తుందా అనేది తేలాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే మహా సముద్రంలో మరో హీరోయిన్ కూ ఛాన్స్ ఉందన్నమాటే కదా.. ?

tollywood news