పల్లెటూరి అమాయకత్వం. లోకాన్ని చదివిన అనుభవం. తెలంగాణ యాసలోని కమ్మదనం. అన్నీ కలిపితే గంగవ్వ. ‘మై విలేజ్ షో’ తో ఫేమస్ అయిన గంగవ్వ నేషనల్ మీడియాని కూడా ఆకర్షించింది. తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న యూట్యూబ్ స్టార్ గంగవ్వ బిగ్‌బాస్ షోలోకి ఎంటరైంది. హౌజ్ లో తన కష్టాలు చెప్పుకుని అందరిని ఏడిపించేసింది. సుమారు 60 ఏళ్లు ఉన్న గంగవ్వను కంటెస్టెంటుగా సెలెక్ట్ కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆమె ముచ్చట్లు చెప్తే తెలుగు ప్రజలు చెవులు రిక్కించి మరీ వింటారు. లక్షలాది మంది భిమానులను సొంతం చేసుకున్న గంగవ్వ హౌస్‌లోనూ మంచి ముచ్చట్లు పెడుతుందా? ఎవరైనా తోక జాడిస్తే మాటలతో బెదిరించి గాడిలో పెడుతుందా? అనేది చూడాలి.
సోషల్ మీడియా స్టార్ కాకముందు.. గంగవ్వ కష్టాలను అనుభవించింది. పొట్ట కూటీ కోసం వ్యవసాయ కూలీగానూ పనిచేసింది. చిన్నప్పటి నుంచి సవాళ్లను అధిగమించింది. సోషల్ మీడియా పుణ్యామా అని స్టార్ గా మారింది. కూలీగా పనిచేసే గంగవ్వ బిగ్ బాస్ వరకు వెళ్లడంతో ‘గంగవ్వ యూ ర్ గ్రేట్’ అని అంటున్నారు.