గేట్ ర్యాంకర్ .. చేసేది పకోడీ వ్యాపారం

Spread the love

Gate Ranker Making Pakodi

అతను గేట్ ర్యాంకర్ .. చాలా కష్టపడి చదివాడు.. గేటు లో మంచి ర్యాంక్ సాధించాడు. కానీ అతని కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అతని చదువును ఆపేశాయి . కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించేలా చేశాయి. కుటుంబం కోసం పకోడీల వ్యాపారం చేస్తూ తన కోరికను చంపుకున్న ఆ యువకుడు తల్లిదంరుల కోసమే వ్యాపారం చేస్తున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే గేట్ లో ర్యాంక్ కొట్టి..పకోడి వ్యాపారం చేస్తున్నాడు. గేట్‌ ఎగ్జామ్‌ ఎంత కష్టంగా ఉంటుందో ఇంజనీరింగ్‌ చదివే వారికి మాత్రమే తెలుస్తుంది. లక్షల మంది విద్యార్ధులు పోటీ పడే ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్‌ సాధించడం కోసం ఇంజనీరింగ్‌ ఫస్ట్ ఇయర్ నుంచే కోచింగ్‌ కి వెళ్తూ చాలా కష్టపడుతుంటారు. ర్యాంక్‌ వచ్చిందంటే జీవితం సెటిల్‌ అయినట్లే అనుకుంటారు. అలాంటిది గేట్‌లో బెస్ట్ ర్యాంక్‌ సాధించిన ఓ కుర్రాడు దాన్ని వదిలేసి పకోడాలు అమ్ముతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.ఉత్తరాఖండ్‌లో సాగర్‌ షా అనే కుర్రాడు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి M-TECHలో చేరడం కోసం గేట్‌ ఎగ్జామ్‌ రాశాడు. దానిలో బెస్ట్ ర్యాంక్‌ సాధించాడు. అయితే M-TECH పేరుతో మరో రెండుళ్లు కుటుంబానికి భారంగా మారకూడదని భావించి కుటుంబ వ్యాపారమైన పకోడి బిజినెస్‌లో చేరి తండ్రికి చేదోడుగా నిలుస్తున్నాడు.సాగర్‌ మాట్లాడుతూ..ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక గేట్‌ ఎగ్జామ్‌ పాస్‌ అవ్వాలనేది నా కల. అందుకోసం చాలా కష్టపడ్డాను. గేట్‌లో 8 వేల ర్యాంక్‌ సాధించాను. ఆ ర్యాంక్‌తో నాకు NITలోనే సీటు వస్తుంది. కానీ మాది చాలా పేద కుటుంబం ఇంకా రెండేళ్లు చదివి తల్లీదండ్రులకు భారం కాలేను. దాని బదులు ఏదో ఒక పని చేసి నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్నాను అని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *