జెంటిల్మేన్.. కుంజుమోన్.. కొన్ని డౌట్స్ ..?

3
gentleman sequel
gentleman sequel

gentleman sequel

కొన్ని సినిమాలు ఎప్పుడు చూసిన బోర్ కొట్టవు. కారణం ఎంటర్టైన్మెంట్. మరికొన్ని సినిమాలు ఎన్నేళ్ల తర్వాత చూసినా ఫీలింగ్ మారదు. కారణం కంటెంట్. ఇలాంటి బలమైన కంటెంట్స్ తోనే సినిమాలు చేసిన ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శంకర్. అతని తొలి సినిమా జెంటిల్మన్. అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నానని ప్రకటించాడు నాటి అగ్ర నిర్మాత కుంజుమోన్. కానీ ఈ సారి శంకర్, అర్జున్ ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా..? జెంటిల్మన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ప్రత్యేక స్థానం ఉన్న సినిమా. నాటి విద్యావ్యవస్థపై అస్త్రం సంధించి ఆనాడే లక్షల్లో డొనేషన్స్, ఫీజులు కట్టలేక ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్న విషయాన్ని అద్భుతంగా చెప్పాడు దర్శకుడు శంకర్. అర్జున్, మధుబాల జంటగా వినీత్, శుభశ్రీ, చరణ్ రాజ్ ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాలో పాత్ర హైలెట్. ఫీజులు కట్టలేక చదువుకు దూరం అయిన ఓ విద్యార్థి దొంగలా మారి పేదలకు ఉచిత విద్యను అందించేందుకు కాలేజ్ లు కడుతుంటాడు. సింపుల్ గా రాబిన్ హుడ్ తరహా కథ. ఫస్ట్ మూవీ అయినా తనదైన శైలి కథనంతో కట్టిపడేశాడు శంకర్. బలమైన కంటెంట్ ను కమర్షియల్ గా చెప్పి సౌత్ కు తొలి సినిమాతోనే తానేంటో చూపించాడు శంకర్.

రెహ్మాన్ పాటలు సూపర్ హిట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ మెస్మరైజింగ్ అనిపించుకున్నాయి. గౌండమణి, సెంథిల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కు ఇబ్బంది లేకుండా చూసింది. నాటి సంచలన నిర్మాత కెటి కుంజుమోన్ నిర్మించిన ఈ మూవీ చాలా లావిష్ గానూ కనిపిస్తుంది. ప్రధానంగా తమిళ్ లో తెరకెక్కినా.. డబ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించిందీ చిత్రం. జెంటిల్మన్ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నానని ప్రకటించాడు కుంజుమోన్. కొన్నాళ్లుగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటోన్న కుంజుమోన్ సడెన్ ప్రకటించిన ఈ సీక్వెల్ తో ఒక్కసారిగా అటెన్షన్ డ్రా చేశాడు. బట్.. ఈ సారి దర్శకుడు శంకర్ కాదు. హీరో కూడా మారతాడట. మరి ఈ ఇద్దరూ లేకుండా జెంటిల్మన్ నాటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా అనేది పెద్ద డౌట్. ఎందుకంటే కొన్ని కథలకు సీక్వెల్స్ ఒరిజినల్ వాళ్లు చేస్తేనే బావుంటుంది. నేటి విద్యావ్యస్థలో మార్పులు వచ్చినా.. కమర్షియల్ కథకు కావాల్సినన్ని లొసుగులు కూడా ఉన్నాయి. ఏదేమైనా శంకర్, అర్జున్ లేని జెంటిల్మన్ సీక్వెల్ ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

tollywood news