జార్జ్ రెడ్డి సినిమా రివ్యూ…

George Reddy Movie Review 

టైటిల్‌: జార్జ్‌రెడ్డి
జానర్‌: బయోపిక్‌
న‌టీన‌టులు: సందీప్‌ మాధవ్‌, సత్య దేవ్, మనోజ్‌ నందన్, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ, అభయ్‌, ముస్కాన్, మహాతి
దర్శకత్వం: జీవన్‌ రెడ్డి
రిలీజ్ డేట్‌: 22 న‌వంబ‌ర్‌, 2019

చరిత్ర మరిచిన వ్యక్తుల మీద సినిమాలు తీయడం ప్రస్తుతం జరుగుతుంది. వారి వారి జీవిత కథ ఆధారం చేసుకుని బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్. అయితే కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో జార్జ్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 45 ఏళ్ల కింద దారుణ హత్యకు గురైన ఈ స్టూడెంట్ లీడర్ బయోపిక్ జార్జి రెడ్డి సినిమా రూపంలో నేడు మనముందుకు వచ్చింది. దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయి ఆ తర్వాత మరిచిపోయిన వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జార్జిరెడ్డి సినిమాని దర్శకుడు ఏ విదంగా తీర్చి దిద్దాడో ఓ సారి చూద్దాం…

కథ… హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న జార్జి రెడ్డి (సందీప్ మాధవ్) కేరళ ప్రాంతానికి చెందినవాడు. చిన్నప్పట్నుంచే చదువులో చురుకుగా ఉండే జార్జి రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఇక ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే అరాచకాలను చూసి చలించిపోతాడు. అక్కడ జరిగే గొడవలు, బయట వ్యక్తుల ఆధిపత్యం చూసి అస్సలు ఓర్చుకోలేకపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అయన భగత్‌ సింగ్‌, చెగువేరా స్పూర్తితో కళ్లముందు అన్యాయం జరిగితే చూసి తట్టుకోలేడు. అన్యాయం జరిగితే చిన్న పెద్ద తేడా చూడకుండా తిరగబడతాడు. అతని స్నేహితులు దస్తగిరి(పవన్‌), రాజన్న(అభయ్‌)లతో కలిసి అన్యాయాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఓయూలో ఎవ్వరికి కష్టం వచ్చిన సందీప్ మాధవ్ కు చెప్పుకునే పరిస్థితి. అలా అతి తక్కువ కాలంలోనే విద్యార్ధినేతగా ఎదుగుతాడు. అయితే అప్పటికే యూనివర్సిటీలో ఏబీసీడీ అనే స్టూడెంట్ యూనియన్‌తో పాటు మరో యూనియన్ మధ్య వర్గపోరు నడుస్తుంటుంది. అయితే ఆ ఇద్దర్ని కాదని సందీప్ మాధవ్ పీఎస్ అనే విద్యార్ధి యూనియన్‌ను స్థాపించిన జార్జిరెడ్డి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తాడు. అయితే ఇదంతా గిట్టని ఓ వర్గం సందీప్ మాధవ్ ని అతి కిరాతంగా హత్య చేస్తుంది. అయితే ఇదంతా తెలిసిన కథే అయినప్పటికీ. దర్శకుడు  తెరపై చూపించిన విధానంపై ఆసక్తి నెలకొన్నది.

విశ్లేషణ… విప్లవ భావాలు, అద్భుతమైన సినిమాటోగ్రఫి, రీరికార్డింగ్‌తో కూడిన ప్యాకేజ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అప్పటి నేపథ్యం దగ్గరనుంచీ.. ఆయా పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం వరకూ.. ఇలా ప్రతిది జీవన్ రెడ్డి చాల చక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక ఈ సినిమా హీరో విషయానికి వస్తే… వంగవీటితో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సందీప్‌ మాధవ్‌ ఈ సినిమాలోనూ మెప్పించాడు. చాలా చోట్ల జార్జిరెడ్డే కళ్ల ముందే నిలుచున్నట్లు అనిపిస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫి. కెమెరా పనితనం బాగుండటంతో ఆ కాలానికి వెళ్లిపోతాం. ఇక యాక్షన్‌ సీన్స్‌ కూడా కొత్తగా అనిపిస్తాయి. పాటలు సన్నివేశాలకు తగ్గట్టు బాగున్నాయి. మొత్తనికి జార్జిరెడ్డిని హత్య చేసిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :
జార్జిరెడ్డి పాత్ర
ఎమోషనల్ సీన్స్
నటీనటుల నటన
పాత్రలు మరియు డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం

రివ్యూ… జార్జ్‌రెడ్డి జీవిత చ‌రిత్రను  ప్రస్తుత తరానికి చెప్పేందుకు చేసిన ప్ర‌య‌త్నం అందర్నీ ఆకట్టుకుంది. హైదరాబాద్ ఓయూ యూనివర్సిటీలో ఓ చేగువేరా లాంటి విప్లవ కారుడి జీవితం గురించి తెలుసుకోవాల‌నుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన చిత్రం

http://tsnews.tv/nandamuri-balakrishna-ruler-official-teaser/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *