ఎలక్షన్ స్టంట్ షురూ

Ghmc Election Stunt Start

ఎందుకో తెలియదు కానీ, ఎన్నికలు వస్తుంటే చాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మీద ఎనలేని ప్రేమ వచ్చేస్తుంది. వీరిని బుట్టలో వేసుకునేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. దుబ్బాక ఎన్నికల ఫలితం తారుమారు కాగానే.. అధికార పార్టీకి ఒక్కసారిగా షాక్ కు గురైందేమో తెలియదు కానీ.. వచ్చే ఏడాది కావాల్సిన ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకే, గత జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే.. ఈసారి ఆస్తి పన్నును యాభై శాతానికి తగ్గించింది. అసలు ప్రజలు అడగక ముందే, ఏడాదికి రూ.15,000 కంటే తక్కువ ఆస్తి పన్నుకట్టేవారికి యాభై శాతం రాయితీని ప్రకటించింది. దీంతో, దాదాపు రూ.7,500 తగ్గుదల లభిస్తుంది. ఇలా, ప్రాపర్టీ ట్యాక్సు తగ్గించగానే.. జనాలంతా ఓట్లు వేస్తారని టీఆర్ఎస్ పగటి కలలు కంటుందేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి, గత ఐదేళ్ల నుంచి జీహెచ్ఎంసీలో అధికార పార్టీ వ్యవహారశైలిని గమనించిన ప్రజలు ఈసారి కారు గుర్తుకు ఓటేస్తారా? లేదా? అనేది సందేహాస్పదమే అనిపిస్తోంది. ఈసారి బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మరి, దుబ్బాకలో హరీష్ రావు ఆధ్వర్యంలో ఓడిపోయిన టీఆర్ఎస్.. కేటీఆర్ నేత్రుత్వంలో గెలుస్తుందా? లేదా? అని చూడాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

ghmc elections 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *