డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ  పోలింగ్

Ghmc Elections On Dec 1

గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్ని అత్యంత వేగంగా జరిపేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసి, నవంబరు 20న నామినేషన్ కు చివరి రోజుగా నిర్ణయించింది. 21న నామినేషన్ల పరిశీలన కాగా, ఉపసంహరణకు 24గా నిర్ణయించింది. డిసెంబరు 1న పోలింగ్, అవసరమైతే 3న రీపోలింగ్ నిర్వహిస్తారు. 4న ఓట్లను లెక్కించి ఫలితాల్ని వెల్లడిస్తారు.

* జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286 మంది ఉండగా.. పురుషులు 38 లక్షల 56 వేల 770 మంది కాగా మహిళలలు 35 లక్షల 46 వేల 847 మంది, ఇతరులు 669 మంది ఉన్నారు.

* మొత్తం పోలింగ్ కేంద్రాలు: 9248
* మొత్తం వార్డులు: 150
* ఈ సారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్
* ఈ ఓటింగ్ ప్రవేశ పెట్టే అవకాశం
* కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్  రికగ్నైజేషన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్ట నున్న ఈసీ
* జీహెచ్ఎంసీ లో అతి పెద్ద డివిజన్
* మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు
* అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు.

 

GHMC ELECTIONS 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *