గోవా సీఎం గట్టెక్కాడు

GOA CM Gadkari … విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రమోద్ సావంత్

గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రమోద్ సావంత్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. సీఎంగా బాధ్యతుల చేపట్టిన వెంటనే… తమకు బలం ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ గవర్నర్‌ను కోరింది.దీంతో అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సిందిగా గవర్నర్ కొత్త ప్రభుత్వాన్ని ఆదేశించారు. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణం, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో శాసనసభ్యుల సంఖ్య 36కి తగ్గింది.
కాంగ్రెస్‌కు 14 మంది సభ్యులున్నారు. బీజేపీకి 15 మంది సభ్యులు ఉండగా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్ర సభ్యుల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తోన్న బీజేపీ అధిష్టానం తన సభ్యులను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది.మిత్రపక్షాలను ఉప ముఖ్యమంత్రి పదవులకు ఒప్పించడంతో అనిశ్చితి తొలగింది. బలపరీక్షకు ముందు తన ఎమ్మెల్యేలను రిసార్ట్, హోటళ్లకు తరలించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన విశ్వా పరీక్షంలో ప్రమోద్ సావంత్‌ ప్రభుత్వానికి అనుకూలంగా 20 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 15 మంది ఓట్లు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *