క‌రోనా జ‌యించిన తెరాస ఎమ్మెల్యే

10
gongidi sunitha corona
gongidi sunitha and his husband hospitalized due to corona

gongidi sunitha corona

ఆలేరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత క‌రోనాను జ‌యించారు. ఆమెతో పాటు భ‌ర్త, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి శుక్ర‌వారం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలేరు ప్ర‌జ‌ల దీవెన‌ల‌తో క‌రోనాను జ‌యించాన‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు అండగా నిలిచి, అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి నిత్యం ప్రజలతో గడిపామ‌ని తెలిపారు. తమ వంతు సహకారంగా ఊరూరా నిత్యావసర సరుకులు, బియ్యం, మాస్కులు, శానిటైజర్లు అందించామ‌ని చెప్పారు. విపత్కార పరిస్థితిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగకూడదని ఆ దిశగా అడుగులు వేశామ‌ని, అయితే అంత‌లోనే క‌రోనా బారిన ప‌డ్డామ‌ని వివ‌రించారు.

 

Govt Whip Gongidi Sunitha