ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?

Good days for Art directors
కరోనా .. ఇప్పటి వరకూ మానవాళిని ఎన్నో వైరస్ లు బాధించాయి. మనిషి అన్నిటినీ తట్టుకున్నాడు. అత్యంత ప్రాణాంతకం అని భావించిన ఎన్నో వైరస్ లు సులువుగా లొంగిపోయాయి. కానీ చిన్న జాగ్రత్తలు చాలు అనుకున్నవి ఎంతోమందిని చంపేశాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఈ రెండో కోవకు చెందినది. అందుకే ప్రపంచం అంతా వణికిపోతోంది. ఇక ఈ మహమ్మారి వల్ల సినిమా పరిశ్రమలు ఎంత అతలాకుతలం అయ్యాయో అందరికీ తెలుసు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో సినిమాకు సంబంధంచి అనేక మార్పులు రాబోతున్నాయి. అందులో ప్రధానమైనది.. లొకేషన్స్. యస్.. లొకేషన్స్ పరంగా అన్ని సినిమాలూ కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. బడ్జెట్ పెట్టే నిర్మాతలు ఉన్నా.. భారీ స్థాయిలో షూటింగ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అనుమతులు ఉండవు. అందువల్ల ఒకవేళ కథ డిమాండ్ చేసినా ఆయా సినిమాల షూటింగ్స్ లోకల్ గానే సాగాలి. అంటే ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న సినిమా కోసం ఏకంగా యూరప్ సెట్స్ ను హైదరాబాద్ లోనే వేశారు కదా. అలా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సెట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడబోతోంది. ఇప్పటికే చాలామంది దర్శకులు తమ రచయితలతో కలిసి కథల్లో మార్పులు మొదలుపెట్టారు. ఇందులో ప్రధానమైనది లొకేషన్స్ కు అనుగుణంగా కథను నడపడం అనేద ముఖ్యమైనది.
అలా కాదు కథ ఖచ్చితంగా డిమాండ్ చేసింది అంటే వెంటనే గుర్తొచ్చేది ఆర్ట్ డైరెక్టర్స్. అది హైదరాబాద్ అయినా అమెరికా అయినా.. దుబాయ్ అయిన దువ్వాడ అయినా.. అన్నిటినీ అందుబాటులో ఉన్న స్టూడియోస్ లో సెట్స్ వేయడం అనే ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఆర్ట్ డైరెక్టర్స్  ప్రతిభకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని కదా అర్థం. ఒకప్పుడు మన పాత సినిమాలు పైగా క్లాసిక్స్ అని చెప్పుకుంటోన్న ఎన్నో సినిమాలు కేవలం స్టూడియోస్ లోనే చిత్రీకరించారు. అంటే ఆర్ట్ వర్క్ ఆ రేంజ్ లో ఉండేదని కదా అర్థం. ఇప్పుడు మరోసారి అలాంటి అవసరం అన్ని సినిమా పరిశ్రమలకూ వచ్చిందనేది నిజం.  ఇప్పటికే నాని హీరోగా నటిస్తోన్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ మూవీ కోసం ఓల్డ్ కలకత్తా సెట్ ను హైదరాబాద్ లోనే వేస్తున్నారు. అలా రాబోయే రోజుల్లో ఇలాంటి సెట్స్ కు విపరీతమైన డిమాండ్ రాబోతోంది. ఇది కేవలం తెలుగులోనే కాదు. అన్ని భాషల్లో కూడా అప్లై అవుతుంది. సో.. ఇకపై దర్శకులు, రచయితలు రాసుకునే కథల్లో ఊహలకు మరీ బయటి దేశాల రెక్కలు తొడగకుండా అందుబాటులో ఉన్న వనరులతో కూడిన కథలే రాసుకుంటే బెటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *