ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

5
WHEN IS PRABHAS BIG MOVIE?
WHEN IS PRABHAS BIG MOVIE?

good news for prabhas fans

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యాం(వర్కింగ్ టైటిల్) గురించి అభిమానుల్లో జరిగిన చర్చలు, రచ్చలు అతని మరే ఇతర సినిమాకూ జరగలేదనే చెప్పాలి. ఓ దశలో అసలు ఈ సినిమా ఉంటుందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. సాహో ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ సినిమా కథలో అనేక మార్పులు చేశారు. మొదట్లో కేవలం ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందించాలనుకున్నారు. కానీ ప్రభాస్ ఇమేజ్ తో పాటు ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ‘యాక్షన్’ పార్ట్ కూడా మిక్స్ చేశారు. గతంలో గోపీచంద్, రాశిఖన్నా జంటగా ‘జిల్’అనే ఒకే సినిమా చేసిన రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. యూరప్ బ్యాక్ డ్రాప్ లో 1960ల నేపథ్యంలో సాగే కథ అని ముందే చెప్పారు. అయితే ఈ సినిమా మొదలై దాదాపు యేడాది దాటింది. కానీ షూటింగ్ మాత్రం గతేడాది అక్టోబర్ చివర్లోనే ప్రారంభం అయింది. దీంతో అప్పటి నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ కోసం అభిమానులు తెగ అడుగుతున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ పట్టించుకోకపోవడంతో చివరికి నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లతో హల్చల్ కూడా చేశారు. మొత్తంగా అభిమానుల ఆవేదనను నిర్మాణ సంస్థ పట్టించుకున్నట్టుంది.

అందుకే వారికోసం గూడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. ఈ నెల 10 ప్రభాస్ 20వ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తున్నట్టుగా యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ లోనే కాదు.. అసలు ఈ సినిమాకు సంబంధించి ఏం జరుగుతుందా అని ఫీలవుతోన్న ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పొచ్చు. గతంలో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఓ పెద్ద ఇంటిలో ప్రభాస్ అటు తిరిగి నించున్న ఫోటో ఒకటి విడుదల చేశారు. మరి ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ మాత్రమే ఉంటాడా లేక హీరోయిన్ పూజాహెగ్డే కూడా కనిపిస్తుందా అనేది చూడాలి. ఇక టైటిల్ విషయానికి వస్తే మొదట్లో జాను అని పెట్టాలనుకున్నారు. కానీ ఈ టైటిల్ తో శర్వానంద్, సమంత జంటగా వచ్చిన సినిమాకు వాడారు. అలాగే ప్రస్తుతం ‘రాధే శ్యాం’, ‘ప్రియ’అనే టైటిల్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏదో ఒక టైటిల్ తో వెళతారా లేక కొత్తగా మరో టైటిల్ తో వస్తారా అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా ప్రభాస్ మూవీకి సంబంధించిన అప్డేట్ తో ఫ్యాన్స్ లో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం మొదలవుతుందనే చెప్పాలి.

tollywood news