డైరీ రైతులకు తీపి కబురు

3
good news to dairy farmers
good news to dairy farmers

good news to dairy farmers

# పెండింగ్ ప్రోత్సాహకాల విడుదల కు గ్రీన్ సిగ్నల్

# 18 తరువాత శుభముహూర్తం

# 60 వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది

# 65కోట్ల విడుదల కు రూట్ క్లియర్

డైరీ రైతులకు పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహక బకాయిల విడుదల కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 తరువాత విడుదలకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు నార్మక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వర్ రావు లు ప్రకటించారు. ఈ మేరకు ఐటి మరియు పురపాలక శాఖామంత్రి తారకరామారావు, విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి లతో పాటు పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు లను మంగళవారం ఉదయం రాష్ట్ర శాసన సభలో కలసి బకాయిల విషయాన్ని ప్రస్తావించినట్లు వారు తెలిపారు.

2019-20,2020-21 సంవత్సరాలకు గాను నార్మక్స్ పరిధిలోని 25 వేల మంది రైతులకు 24 కోట్లు,కరీంనగర్ డైరీ పరిధిలోని 35 వేల మంది రైతులకు 28 కోట్లు,ముంగనూరు డైరీ పరిధిలోని రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకాలకు గాను 13 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు.ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకరావడంతో సానుకూలంగా స్పందించిన ఆయన ఈ నెల 18 తరువాత బకాయి పడ్డ ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు  పేర్కొన్నారని వారు తెలిపారు. అందుకు ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారకరామారావు తో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి,తలసాని, హరీష్ రావులకు నార్మక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

Telangana Assembly Updates