నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ .. 76వేల 578 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Spread the love

GOOD NEWS TO UNEMPLOYES

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికల ముందు నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. భారీగా ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. కేంద్ర పారా మిలటరీ బలగాల్లో పెద్దఎత్తున పోస్టుల రిక్రూట్‌మెంట్‌కి హోంశాఖ తెరతీసింది. 76వేల 578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ విభాగాల్లో ఖాళీలు త్వరలో భర్తీ కానున్నాయి. ఈ మొత్తం ఉద్యోగాల్లో 54వేల 953 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, వీటిలో మహిళల కోసం 7వేల 646 పోస్టులను కేటాయించారు.
కానిస్టేబుల్ పోస్టుల్లో సీఆర్పీఎఫ్‌లో అత్యధికంగా 21వేల 566 ఖాళీలు ఉన్నాయి. బీఎస్ఎఫ్‌లో 16వేల 984పోస్టులు,ఎస్ఎస్‌బీలో 8వేల 546 పోస్టులు,ఐటీబీపీలో 4వేల 123 పోస్టులు,అస్సాం రైపిల్స్‌లో 3వేల 076 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. 2019 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేయనున్నారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ హోదాలో 1,073 పోస్టులు ఉండగా వాటిలో బీఎస్ఎఫ్‌లో 508, సీఆర్పీఎఫ్‌లో 274, ఎస్ఎస్‌బీలో 206, ఐటీబీపీలో 85 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా ట్రేడ్స్‌మెన్, హోంశాఖ, వైద్యం, పారా మెడికల్, కమ్యూనికేషన్, ఇంజినీరింగ్ రంగాల్లో మరో 20వేల 086 పోస్టులను ప్రమోషన్ల ద్వారా హోంశాఖ భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన ఎన్నికలకు ముందే రానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *