రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై బంద్

Google stops free Wi-Fi at railway stations

రైల్వే ప్రయాణికులకు  రైల్వే శాఖ బ్యాడ్ న్యూస్  చెప్పింది . ఇక రైల్వే స్టేషన్ లలో ఉచిత వైఫై పై  గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో అందిస్తున్న ఉచిత వైఫైను ఎత్తివేస్తున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సర్వీసులు ఇక నుంచి ఆగిపోనున్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే… ఇప్పుడు ఇంటర్నెట్ సేవల ధరలు చాలా చౌకగా మారిపోయాయి. అందులోనూ ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ పెరిగింది. వివిధ రకాల ధరల్లో సులభంగా ఇంటర్నెట్ సేవలు లభ్యమవుతున్నాయి. చాలా ఫాస్ట్‌గా నెట్ వర్క్ అందుతోంది. కనుకనే దేశవ్యాప్తంగా వున్న అన్ని రైల్వే స్టేషన్‌లలో ఇంటర్నెట్ సేవలను ఆపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ప్రారంభించించగా.. ఇప్పటికి ఇది 5 సంవత్సరాలను పూర్తి చేసుకుందన్నారు. 2020 నాటికి 400కు పైగా అన్ని రైల్వే స్టేషన్‌లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్లు సీజర్ గుప్తా వెల్లడించారు.

Google stops free Wi-Fi at railway stations,free wif, railway stations, railway , google, internet services , public wifi , seejar guptha

Related posts:

దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై సేవలు నిలిపివేత
10 వేల కోట్లను చెల్లించిన ఎయిర్ టెల్
5జీ  చీపెస్ట్  ఫోన్లు...జియో సంచలనం
 రిపబ్లిక్ డే సేల్స్ ..ఆఫర్లతో అమెజాన్,ఫ్లిప్ కార్ట్
నిరుద్యోగులకు పండుగ లాంటి వార్త చెప్పిన అమెజాన్
విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీపట్టిన నాసా
విక్రమ్ పై ఆశలు అడియాశలేనా?
ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్
ఎకో ల్యాబ్ ను ఆవిష్క‌రించిన డ్రూమ్
కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్
ఈ లాప్ టాప్ ను మడతపెట్టేయొచ్చు
కాంగ్రెస్ లో చేరిన బాలీవుడ్ తార ఊర్మిళ
కోట్లాది యూజర్ల పాస్ వర్డ్స్ టెక్స్ట్ రూపంలో దాచిన ఫేస్ బుక్
ఎన్టీఆర్‌..బిగ్ బాస్ 3 చేయ‌డం లేదు.. 
మ‌హేష్‌ను క‌లిసి న‌రేష్ ప్యానెల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *