దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై సేవలు నిలిపివేత

Google stops free Wi-Fi at railway stations

గతంతో పోల్చితే ప్రస్తుతం మొబైల్ డేటా చాలా చౌకగా లభిస్తుంది. గతంలో మొబైల్ కాల్స్ రేట్లు, డేటా ప్లాన్స్ రేట్లతో వినియోగదారులకు చుక్కలు చూపించేవి. ఎప్పుడైతే జియో వచ్చి సంచలనం క్రియేట్ చేసిందో అప్పటి నుంచి దేశంలో కాల్స్, డేటా చార్జీలు ఒక్కసారగా కిందకొచ్చేశాయి. గతంతో పోల్చితే దాదాపుగా ఈ రేట్లు 90 శాతానికి తగ్గాయి. దీన్ని ద్రుష్టిలో పెట్టుకుని గూగుల్ సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..గూగుల్ సంస్థ రేల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందిస్తుంది. రేల్వే శాఖతో గూగుల్ ఈ సేవలు అందిస్తుంది. అయితే ప్రస్తుతం మొబైల్ డేటా ఛార్జీలు తగ్గడంతో రైల్వే స్టేషన్లలో వైఫై సేవలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను ఎత్తివేసింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు.

Google stops free Wi-Fi at railway stations,Google winds down free Station Wi-Fi,free Wi-Fi at railway stations,free public Wi-Fi,#Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *