దసరాకు గోపీచంద్ సినిమా

4
gopichand movie
gopichand movie
gopi chand movie update

పండగల సందర్భంగా పాత బట్టలన్నిటినీ క్లియరెన్స్ సేల్ గా పెడుతుంటారు. ఇప్పుడు ఓటిటిల వల్ల సినిమాల పరిస్థితి కూడా అలాగే అయింది. విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమాలన్నీ క్లియరెన్స్ సేల్ లాగా బయటపడుతున్నాయి. నిజంగా చెబితే ఇప్పటి వరకూ తెలుగులో ఓటిటి ప్లాట్ ఫామ్స్ లోవిడుదలైన సినిమాల్లో ఒక్క ఉమామహేశ్వర, వి తప్ప  ఏదీ ఈ యేడాదే పూర్తయింది లేదు. ఇవి ఎప్పటి నుంచో రిలీజ్ కు నోచుకోకుండా ఉన్నవే అవన్నీ. ఆ లిస్ట్ లోకి గోపీచంద్ సినిమా కూడా రాబోతోంది. 2017లో గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా నాటి మాసివ్ డైరెక్టర్ బి గోపాల్ రూపొందించిన ‘ఆరడుగుల బుల్లెట్’వ్యవహారం తేలిపోయింది. ఆ మధ్య ఆహా, అమెజాన్ అంటూ హడావిడీ చేశారు. కానీ ఫైనల్ గా జీ5 ఈ బుల్లెట్ ను దక్కించుకుంది. ఎప్పుడో పూర్తయిన సినిమా. పైగా అంచనాలు కూడా ఏమాత్రం లేవు. నిజానికి ఈ సినిమా రేపు విడుదలవుతుంది అనగా కోర్ట్ నుంచి ఫైనాన్సియల్ ఇష్యూస్ కు సంబంధించి స్టే వచ్చింది. ఆ స్టే తర్వాత మళ్లీ ఏ దశలోనూ విడుదలవుతుంది అనిపించలేదీ సినిమా.

ఫైనల్ గా క్లియర్స్ సేల్ లాంటి ప్లాట్ ఫామ్స్ గా మారిన ఓటిటిలో వచ్చేస్తోంది. అప్పటి గోపీచంద్ ఇమేజ్ కు తగ్గట్టుగానే కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిందీ సినిమా. బి గోపాల్ శైలిలో ఉంటూనే గోపీ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంటుందని అప్పట్లో గ్యారెంటీ హిట్ అనే రేంజ్ లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది టీమ్. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఏదో రకంగా అవకాశం వచ్చింది. మరి ఛాన్స్ ను ఆరడుగుల బుల్లెట్ ఎలా ఉపయోగించుకుంటుందో కానీ వచ్చే దసరా నుంచి ఈ సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుందట. మరి ఈ పండగకు గోపీచంద్ బుల్లెట్ టార్టెగ్ ఛేదిస్తుందా లేదా అనేది చూడాలి.