కరీంనగర్ లో ఆ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దు

Government Cancels Karimnagar Registration hospital

కరీంనగర్‌‌లో రూల్స్‌‌కు విరుద్ధంగా  బిల్డింగ్‌‌లో కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర కిడ్నీ సెంటర్‌‌ హాస్పిటల్ రిజిస్ట్రేషన్‌‌ రద్దు చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దవాఖానా కొనసాగుతోన్న ఐదో అంతస్తును సీజ్‌‌ చేశామని కూడా వివరించింది. గతంలోని హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఇటీవల ధర్మాసనం ప్రభుత్వాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకున్నట్లు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ అభిషేక్‌‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌కి సోమవారం ప్రభుత్వ లాయర్‌‌ తెలిపారు.
అనుమతి లేని బిల్డింగ్ లో హాస్పిటల్ నిర్వహించడంపై సీహెచ్‌‌ లక్ష్మీ నర్సింహారావ్‌‌ వేసిన కేసులో హైకోర్టు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి కేసును క్లోజ్‌‌ చేసింది. అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారని పిటిషనర్‌‌ తిరిగి హైకోర్టుకు రావడంతో డివిజన్‌‌ బెంచ్‌‌ మండిపడింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెట్ బ్యాక్, ఫైర్‌‌ సేఫ్టీ మెజర్స్‌‌ తీసుకునేందుకు వ్యవధి కావాలని హాస్పిటల్ యాజమాన్యం కోరిందని లాయర్‌‌ తెలిపారు. దీంతో విచారణ 2 వారాలకు వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

tags :karimnagar district, hospital, registration, cancellation, high court, orders ,

http://tsnews.tv/gas-cylinder-blast-in-guntur-disrtict/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *