Rరాష్ట్ర Tతప్పులు Cకంట్రోల్ చేసే సమ్మే

GOVERNMENT MISTAKES CONTROLLED AGITATION

R రాష్ట్ర T తప్పులు C కంట్రోల్ చేసే సమ్మేగా దీన్ని గుర్తించాలి. ఇది RTC ఒక్కరికే సంభందించిన విషయమేనా? అనేది ఆలోచించాలి. వాళ్లు చేస్తున్నది వాళ్ళ జీతాల కోసమే, వాళ్ళ లాభం కోసమే , అందులో సంస్థకు కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అనుకుందాం. మరి 70 వేల పుస్తకాలు చదివి, అన్నిరంగాల్లో పట్టున్న తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక మేధావి గడిచినా 5 సంవత్సరాల గా ఈ సమస్య గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు చొరవ తీసుకోలేదు?

ఎదుటి వాడి సమ్మె తప్పు, వాడు డ్యూటీకి రాకుంటే తప్పే.. మరి మీ నోటరీ ద్వారా కోటరీలో చేరిన వారు ఏ బస్సులు కడుగుతున్నరు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నరు. వాళ్లు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? మీకు ప్రజల ఇబ్బందుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందే ఎందుకు చేయలేదు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని వారిపై మీరు తీసుకునే చర్యలేమిటి? అని నిలదీస్తున్నారు. మీ కోటరీ మొత్తాన్ని పుర్రెలూపే గొర్రెలుగా చేసి, వారి ఆలోచనలు అణచి వేసి అన్ని నాకే తెలుసు అనుకొనే మీరే నేటీ ప్రజల రవాణా బాధలకు బాధ్యులని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.

తెలంగాణ సమాజం, కుహనా ఉద్యోగుల జేఏసీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? తెలంగాణ ఉద్యమంలో వారిని రెచ్చగొట్టి ఉద్యమంలో కి లాగింది టీఎన్జీవో జేేఏసీయే కదా? ఇలాంటి కీలక తరుణంలో వీరు ఎందుకు ఆర్టీసీకి మద్ధతు పలకడం లేదు? తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు అంటున్నారు. తప్పు ను తప్పు అనకపోవడం కూడా తప్పే.”పిల్ల ముద్దు కానీ పియి ముద్దు కాదు” అని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తదుపరి ఉద్యోగులు ఒక విధమైన మైకంలోకి వెళ్లి పోయారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పటి మాటలు కూడా అట్లనే ఉండే. మొదటి పీఆర్సీ  ఇచినప్పుడే “ఈతాకు అంత ఇచ్చి తాటి ఆకు” అంత చెప్పారు. జీతాలు రెట్టింపు అయినట్లుగా చెప్పుకొచ్చారు. పాలాభిషేకం చేశారు. దాంతో ప్రజల లో ఉద్యోగుల పట్ల ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడింది. ఉద్యోగుల బేసిక్ పే రెట్టింపు అయిందే తప్ప జీతం కాదు. జీతం మహా అయితే పావలా శాతం పెరగొచ్చు. అప్పుడు పీఆర్సీ ఇస్తూ సీఎం అన్న మాటలు ఏమిటి? “దీనికి ఒక కమిటీ వాటి సమావేశాలు అవసరమా” అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కమిటీ, దాని పొడిగింపు. అయినా నోరెత్తక పోవడం చాలా బాధాకరం.

జూలో సింహ వేటను మరచి రోజు వేసే మాంసం ముక్కలకు అలవాటు పడ్డట్లు వీరు తయారు అయ్యారు. సహజంగా చేయాలిసిన పనులు వినతులు, నిరసనలు, లంచ్ అవర్ నిరసన, పెన్ డౌన్ , సమ్మె నోటీస్ వంటివి ఎక్కడికి పోయాయి? గచ్చి బౌలికి పోయాయా? పీఆర్సీ మీద నోరెత్తక పోవటానికి కారణం గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీయేనా? ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా APNGO, TNGO, APSA (సెక్రటేరియట్ ) సంఘాలు ఫిటిమెంట్ ను ఫైనల్ చేయటంలో కీలక పాత్ర పోషించారు. టీచర్ల సంఘాలు ముఖ్యమంత్రి దగ్గర చర్చల్లో ఉన్నా కూడా వీరిదే ప్రధాన పాత్ర పోషించారు.

ఇప్పుడు చూస్తే తెలంగాణ లో ఉన్న ఉపాధ్యాయ సంఘాల్ని మినయిస్తే మిగతా అందరూ హోసింగ్ సొసైటీల అక్రమాలకు పాల్పడిన వారే. వారిపైన కేసులు ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్నాయి. పేరులోనే  “కారం” ఉంది తప్ప చేతలలో “ఉప్పు కారం” లేదు అని సాటి ఉద్యోగులు భావిస్తున్నారు. కారణం తను టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో కట్టిన అక్రమ ఆరంతస్తుల  ఇల్లే. ఉద్యోగుల ప్రయోజనాలన్ని అక్కడ తాకట్టు పెట్టారు. సంఘాలకు వచ్చే బాడుగలు, బతుకమ్మ పండుగకు ఇచ్చే ఇనాంలు, స్పోర్ట్స్ గ్రాంట్ల్ ఇవి తినటానికి మరిగి ఊడిగ/బాడుగ సంఘాలు గా మారిపోయినవి. అందుకే, ఇవి ఆర్టీసీ సమ్మెకు మద్ధతు ఇవ్వడం మరిచిపోయాయి. అస్సలు ఆ సమ్మె ఒకటి జరుగుతుందన్న ఆలోచన కూడా వీరికి లేనట్లుగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నామని ప్రజలు అంటున్నారు. సమయం వచ్చినప్పుడే తమ తడాఖా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

WHY TNGO IS SILENT?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *