జియోపై ఉండే శ్రద్ధ బిఎస్ఎన్ఎల్ పై ఎందుకు లేదు?

Government not care about BSNL

కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ జియో వంటి ప్రైవేట్ సంస్థల కోసం అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తూ ప్రైవేటు సంస్థలకు సహకరించిన అంతగా బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలకు సహకరించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కుదేలవుతున్న పట్టింపులేని ట్లు వివరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితి బిఎస్ఎన్ఎల్ చేరుకోవడంతో బిఎస్ఎన్ఎల్ కష్టాలనుండి నష్టాల నుండి గట్టెక్కాలంటే ఫోర్ జి స్పెక్ట్రమ్ ను అందుబాటులోకి తీసుకురావాలని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ మనుగడ సాగించాలంటే ఫోర్ జి మార్కెట్ సేవలను అందించాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది. ప్రస్తుతం ఫోర్ జి మార్కెట్ ని ఏలుతున్న రిలయన్స్ జియో వంటి కంపెనీలతో పోటీ పడాలంటే బిఎస్ఎన్ఎల్ ఫోర్ జి నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది.

2010 నుండి బిఎస్ఎన్ఎల్ కంపెనీ నష్టాల్లో మునిగి పోతోంది. దీని ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదని తెలుస్తోంది. ఫోర్ జి స్పెక్ట్రమ్ ఇవ్వాలని అది ఇవ్వడానికి అవసరమయ్యే 6767 కోట్లను ఈక్విటీ గా పరిగణించాలని కూడా బిఎస్ఎన్ఎల్ మోడీ ప్రభుత్వాన్ని కోరింది. కానీ మోడీ ప్రభుత్వం రిలయన్స్ జియో వంటి సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఒక వాదన వినిపిస్తోంది. రిలయన్స్ జియో వంటి సంస్థలు తమ కస్టమర్లకు ఫ్రీ సర్వీస్ పేరుతో అందిస్తున్న సేవలకు వారి ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి రిలయన్స్ జియో వంటి సంస్థలకు ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటు ప్రభుత్వానికి నష్టం చేస్తుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలకు వ్యతిరేకంగా రిలయన్స్ జియో వంటి సంస్థలను ప్రభుత్వం పెంచి పోషించినంత కాలం బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితులు మారవని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది.

tags : reliance jio, bsnl, bsnl loss, 4g spectrum, trai, telecom regulatory authority

రేవంత్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

డెంగ్యూ జ్వరాల పై హైకోర్టు సీరియస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *