Govt Teacher Got Corona
సిద్దిపేట జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వెంటనే స్కూలుకు సెలవును ప్రకటించారు. అయితే, తను ఎప్పట్నుంచి స్కూలుకు వచ్చాడు? ఎంతమందికి క్లాసులు తీసుకున్నాడు? పాఠశాలలో ఎంతమందితో కలిసి తరుచూ మాట్లాడేవారు? ఇలాంటి విషయాలన్నీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ, తను గనక విద్యార్థులకు క్లాసులు తీసుకుంటే, ఆయా తరగతుల విద్యార్థులందరినీ క్వారంటైన్ లో ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తానికి, దుబ్బాక మండలం రామక్కపేట జెడ్ పీఎహెచ్ పాఠశాలలో జరిగిన ఈ సంఘటన వల్ల ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిసింది.