శ్మశానవాటిక.. క్వారంటైన్ సెంటర్

GraveYard Is Quarantine Centre

ఎంత దారుణం.. ఎంత దారుణం.. తెలంగాణలో కరోనా పాజిటివ్ బాధితులకు దిక్కు లేకుండా పోయింది. అనేక జిల్లాల్లో సరైన ఆస్పత్రులు లేకపోవడంతో కరోనా బాధితులు ఎక్కడుండాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో తాజాగా ఒక దారుణం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో కానీ, హోం క్వారంటైన్లో ఉంచాల్సిన వ్యక్తులను శ్మశాన వాటికలో క్వారంటైన్ చేశారు. కల్లేరు మండలం ఎమ్మెల్యే సొంత గ్రామం అయిన ఖానాపూర్ గ్రామంలోని శ్మశాన వాటికలో తాజా సంఘటన చోటు చేసుకున్నది. ఇలా శ్మశాన వాటికలో కరోనా పేషేంట్లను పెట్టడం బాధాకరమైన సంఘటన అని కొందరు ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వమేమో గొప్పలు చెబుతున్నది.. కానీ వాస్తవ పరిస్థితులేమో ఇందుకు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. విచిత్రమేమిటంటే.. ఈ కరోనా బాధితులకు సర్పంచ్ భోజన సదుపాయాలు కలిపిస్తున్నారు. అయితే, ఈ వైకుంఠధామం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని తెలిసింది.

Telangana Corona Latest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *