ఢిల్లీలో ‘గ్రీన్’ దీపావళి

#Green Deepavali in Delhi#

దేశంలోనే అత్యధికంగా కాలుష్యం నమోదయ్యే ప్రాంతం ఢిల్లీ. పొగమంచు, వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం.. ఇలా ఢిల్లీ అంతటా కాలుష్యమే రాజ్యమేలుతోంది. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఏ రాష్ర్టాలు తీసుకొని నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని నిర్ణయిచింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ గ్రీన్ దీపావళి జరుపుకోవాలని స్పష్టం కూడా చేశారు.

ప్రభుత్వ ఆదేశాలనకనుగుణంగా ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే కాల్చాలని, టపాసులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని రాష్ర్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కల్పించనుంది. కరోనా నేపథ్యంలో ప్రజలు టపాసులు కాల్చవద్దని మంత్రి తెలిపారు. టపాసులు కాల్చడం, పంట వ్యర్థాల కారణంగా ఢిల్లీ ప్రజలు అనారోగ్య, శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు, పెద్ద పెద్ద టపాసులు కాల్చకుండా, కేవలం దీపాలు వెలిగించి గ్రీన్ దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *