ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

11
Green India challenge by navneeth kaur
Green India challenge by navneeth kaur

Green India challenge by navneeth kaur

గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సోనుసూద్, ప్రకాశ్ రాజ్, త్రిష ఇప్పటికే మొక్కలు నాటారు. తాజాగా మాజీ నటి, పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఈ చాలెంజ్ ను ప్రారంభించడం గురించి తెలుసుకున్నానని, ఎంతోమంది ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చూస్తున్నానని, ఇప్పుడు తాను కూడా అందులో భాగమయ్యానని తెలిపారు. టాలీవుడ్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమల ప్రముఖులు మొక్కలు నాటుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటుండడం ఎంతో బాగుందని కితాబిచ్చారు.

పర్యావరణానికి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని, ఈ చాలెంజ్ కు మద్దతు పలకాలని నవనీత్ కౌర్ అభిమానులకు పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం పట్ల అవగాహన పెంచుకోవాలని, మొక్కలు నాటడం  ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here