HARISH RAO FIRED BANDI SANJAY
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి హరీష్ రావు ఫైర్.
దేశ భక్తి ఉంటే చాలదు…రాష్ట్ర భక్తి కూడా ఉండాలని మంత్రి హరీష్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. ఇక్కడి ప్రజలు గెలిపిస్తే అక్కడికి వెళ్లిన వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని హితువు పలికారు. అన్ని అనుమతులు వచ్చాకే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయడం వెనుక అంతర్యం ఏంటో బండి సంజయ్ చెప్పాలి. ఇందుకు రాష్ట్ర ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని అన్నారు.