సూతిల్ తాడు కు డబ్బులా?

harish rao simplicity

ఏడేళ్లలో ఎప్పుడూ లేని సూతిల్ దారం కు రైతుల వద్ద డబ్బులు అడగటం ఏంటి… ఇది ఎప్పుడు చూడలెదు అని మంత్రి హరీష్ రావు గారు ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం పర్యటనలో వెళుతున్న క్రమంలో గోంగూళూరు గ్రామం వద్ద రోడ్డు వైపు ఉన్న వరి దాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగి రైతులతో మాట్లాడారు.. దిగుబడి, కొనుగోలు కేంద్రాల్లో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ధాన్యం బస్తాలు కుట్టే సూతిలి రైతులే తెచ్చుకోవాలి రాసి ఉన్న బోర్డును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసానని అన్నారు.. సూతిల్ తాడు కు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని వారు చెప్పగా.. సూతిల్ దారం కు డబ్బులు అడుగొద్దు… మనమే తెచ్చివాలి ఇది నేను మొదటి సారి వింటున్న… ఈ ఏడేళ్లలో లేదు.. రైతులకు సుతీల్ మనమే ఇచ్చే వాళ్ళం.. ఇప్పుడు కూడా మనమే ఇవ్వాలి.. రైతులు ఎక్కడికి వెళ్లకుండా..వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని. కొనుగోలు కేంద్రాల్లో సూతిలి తాళ్లు రైతులకు ఉచితంగా ఇవ్వాలని, వెంటనే హమాలి చార్జీలు రైతుల ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు…
రైతు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఫోన్ లో ఆదేశించిన మంత్రి గారు.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని , జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో అమలు చేయాలి అని ఎక్కడ వెంటనే అక్కడే ఉన్న కలెక్టర్ హనుమంతరావు రావును ఆదేశించారు..

– వడ్ల బస్తా పై కూర్చొనే రైతు తో మాట్లాడుతూ… సదా సీదా గానే.

” హరీష్ రావు అంటే మాస్ లిడర్…క్లాస్ కూడా.. ఆయనే అంతే..ఎప్పుడూ సామాన్యంగా.. సదా సీదా నే అని మరో సారి నిదర్శనంగా చూపారు… ఆందోల్ నియోజకవర్గ పుల్కల్ మండలం గొంగులర్ గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద ఆగి అక్కడే ఉన్న వరి బస్తాలపై కూర్చిని రైతులతో ముచ్చటించారు… వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్య పోయారు…ఆనందం వ్యక్తం చేశారు… ఇలా బస్తాలపై కుర్చిని మరో సారి టి ఆర్ ఎస్ ప్రభుత్వం…రైతు ప్రభుత్వం అని తన సదా సీదా తో హరిశ్ రావు గారు నిరూపించారు.

TS POLITICS

టీడీపీ నేతను బండ బూతులు తిట్టిన వల్లభనేని వంశీ

పవన్ కళ్యాణ్ యూ టర్న్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *