హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌, తెలంగాణ పోలీసులు

Hatsoff To KCR

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరికొకరు చురకలంటిచుకుంటూ సమావేశాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై సీఎం జగన్ ప్రసంగించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… దిశా ఘటన నన్ను బాధకు గురి చేసిందని చెప్పిన జగన్ మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక దిశా ఘటనలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానంపై అయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒక చెల్లి ఉందని ఉందని.. ఒకవేళ అలాంటి ఘటన ఏపీలో ఎదురైతే ఎం చేసేవారమో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అలానే చేశారని, ఈ విషయంలో హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌, తెలంగాణ పోలీసులు అంటూ ప్రశంసించారు. ఇక ఎన్కౌంటర్ పై పలు విధాలుగా విమర్శలు చూస్తున్నానని, అయితే జరగకూడని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగిందని ఒకవేళ సినిమాలో హీరో ఎన్కౌంటర్ చేస్తే అందరు చప్పట్లు కొడతారని, అదే నిజంగా జరిగితే కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు.నిజంగా ఒక బాధిత కుటుంబానికి కావాల్సింది వెంటనే శిక్ష అని, ఇలా కోర్టుల్లో జాప్యం జరుగుతున్నందు వల్ల బాధిత కుటుంబాల బాధ మరింత ఎక్కువ అవుతుందంటూ సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *