శభాష్.. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు

hatsoff to retired bank employees

కొవిడ్ -19 నియంత్రణ చర్యలో భాగంగా ప్రజలకు సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ 8 లక్షల 50 వేల రూపాయల విరాళాన్ని అందించింది. ఇవాళ అరణ్య భవన్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిసిన తెలంగాణ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు 8 లక్షల 50 వేల రూపాయల చెక్కులను అందజేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేస్తోన్న కృషిలో తాము భాగస్వాములు కావాలన్న కోరికతో తెలంగాణ పరిధిలోని రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు పెన్షన్ ను విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమాఖ్యలోని ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోషియేషన్ 4 లక్షల 20 వేల రూపాయల చెక్కును, తెలంగాణ బ్యాంకు రిటైర్ ఫెడరేషన్ వారు 3 లక్షల పది వేల రూ పాయల చెక్కును, ఐ.ఎన్.జి వైశ్యా బ్యాంకు పెన్షనర్స్ వెల్ఫెర్ అసోషియేషన్ లక్షా 20 వేల రూపాయల చెక్ ను మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. ప్రభుత్వంతో చేయి చేయి కలిపి కరోనా పై పోరాటానికి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు ముందుకు రావడం హర్షణీయమని మంత్రి హరీశ్ రావు అభినందించారు.

Telangana Live Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *