కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్

Helmet In Car.. Rs. 500 Fine

దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనల చట్టం సెప్టెంబర్ 1 నుండి అమలు చేస్తున్న విషయం తెల్సిందే. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో కొత్త చలానాలు ప్రవేశ పెట్టలేదు. కొత్త చలానాలు అమలు చేస్తున్న నేపథ్యంలో కొందరు వేలకు వేల ఫైన్స్ కట్టాల్సి వస్తుంది. 15 వేల బైక్ కు 21 వేల ఫైన్ ఒక ఆటోకు 40 వేల ఫైన్ ఇలా సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంది. తాజాగా  ఒక కారుకు ట్రాఫిక్ పోలీసులు పంపించిన చలాన్ వైరల్ అవుతోంది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక వ్యాపారికి తన కారుకు చలాన అందుకున్నాడు. అందులో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినందుకు అంటూ రూ. 500 ఫైన్ విధించారు. కారు డ్రైవర్ కు హెల్మెట్ ఏంటీ అంటూ ఆశ్చర్య పోయాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఆ చలానను క్యాన్సిల్ చేయడంతో పాటు.. ఆ చలాన పంపించిన పోలీసులపై కూడా చర్యలకు ఆదేశించడం జరిగింది. ట్రాఫిక్ పోలీసుల అశ్రద్ద మరియు అజాగ్రత్త కారణంగానే ఈ సంఘటన జరిగింది. ఎవరికో ఒకరికి ఫైన్ వేయాలి.. చలానాలు వసూళ్లు చేయాలనే ఉద్దేశ్యంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కారుకు హెల్మెట్ లేదంటూ చలాన పంపించడం దానికి ప్రత్యక్ష నిదర్శణంగా నెటిజన్స్ అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో గతంలో కూడా తప్పుడు చలానాలు అందినట్లుగా వెహికిల్స్ యజమానులు అంటున్నారు.

tags:  Uttar Pradesh Traffic Rules, new motor vehicle act, traffic fines , car, helmet ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *