Hero Akshay kumar Health Secret
మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? అని ఎవరైనా అడిగితే… వెంటనే ‘నేను ఆయిల్ ఫుడ్‌కి దూరం. జ్యూస్ తీసుకోవడం, వాకింగ్, జాగింగ్ లేదా యోగా చేస్తాను’ అని చెప్తారు చాలామంది. ఇదే ప్రశ్న హీరో అక్షయ్ కుమార్ ని అడిగితే ఆశ్యర్యపోయేలా సమాధానం ఇచ్చాడు. ‘‘నేను ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతి రోజూ గోమూత్రాన్ని తాగుతాను. ఆయుర్వేద మెడిసిన్‌లో ఇది చాలా మంచిదని చెబుతారు’’ అన్నారు అక్షయ్. అక్షయ్ ఏంటి గోమూత్రం తాగడమేంటి అనుకుంటున్నారా…
ప్రస్తుతం అక్షయ్ కుమార్ స్కాట్‌ల్యాండ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బెల్ బాటమ్’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. అక్కడ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో జరిగిన ఇన్టు ది వైల్డ్ ఇంటర్వ్యూలో అక్షయ్, చిత్రకథానాయికలు హ్యూమా ఖురేషీ, లారా దత్తా పాల్గొన్నారు. ఆ సమయంలో అక్షయ్‌కు ఏనుగు మలంతో తయారు చేసిన టీని ఇచ్చారు. అప్పుడు హ్యూమా ‘మీరు ఏనుగు మలంతో చేసిన టీని ఎలా తాగారు?’ అని అడిగితే.. ఆరోగ్యం కోసం గోమూత్రం కూడా తాగుతానని బదులిచ్చాడు. అక్షయ్ మాటల్లో నిజం ఉందని చాలామంది చెప్తున్నారు.