Hero Rajashekar at ICU
కోవిడ్ ఇబ్బందులు పడుతున్న రాజశేఖర్ హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ చేరాడు. నిన్న ఆయన ఆరోగ్యం ఆందోళనకరగా ఉన్నప్పటికీ, గురువారం మాత్రం చికిత్సకు స్పందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డాక్టర్లు తెలిపారు.
రాజశేఖర్ ఐసీయూలో ఉన్న విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ‘త్వరగా కోలుకోవాలని’ కోరారు. అయితే గత కొద్ది రోజులుగా రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలను రాజశేఖర్ కుటుంబ సభ్యలు ఖండించారు. ‘నాన్నగారు కోవిడ్‌తో పోరాడుతున్నారు. మీ అందరి ప్రార్థనలు కావాలి. మీ ప్రేమతో ఆయన మరింత ఆరోగ్యంగా బయటకు వస్తారు’ అని ఆయన కుమార్తె శివాత్మిక మరోసారి ట్విట్ చేశారు.