రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీ

Hero Rajashekar Health bulliten

హీరో రాజశేఖర్ కోవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు ప్లాస్మా థెరపీ చేసినట్టు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు వెల్లడించారు. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. రాజశేఖర్ ఆరోగ్యంపై హాస్పిటల్ యాజమాన్యం తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

గతంతో పోలిస్తే రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని, నాన్ ఇన్ వాసివ్ వెంటిలేషన్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. సైటోసార్బ్ పరికరం ద్వారా కూడా చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *