రకుల్… ఈ సాకులేంటి?

2
Rakul comes to infornt of NCB
Rakul comes to infornt of NCB

Rakul comes to infornt of NCB

డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే (ఎన్ సీబీ) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దీపికా పదుకోనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు  (ఎన్‌సీబీ) నోటీసులు జారీ చేసింది. త్వరలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు ఎలాంటి నోటిసులు అందలేదంటోంది రకుల్‌ ప్రీత్‌. హైదరాబాద్‌, ముంబైలో తనకు ఎన్‌సీబీ పంపిన సమన్లు అందలేదని రకుల్‌ ప్రీత్‌ మేనేజర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే ఆమె వ్యాఖ్యలను ఎన్‌సీబీ ఖండిస్తోంది. సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘ఆమెకు సమన్లు జారీ చేశాం.. తను ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించాము. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. పైగా ఇది కేవలం ఒక సాకు.. ఆమె ఈ రోజు దర్యాప్తుకు హాజరు కాలేదు’ అని తెలిపారు. అంతేకాక ‘రకుల్ ప్రీత్ మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆమె హైదరాబాద్‌లో ఉందా లేక ముంబైలో ఉన్నారా అనే విషయం మాకు తెలియదు. మేము ఆమెకు వాట్సాప్‌లో కూడా సమన్లు పంపించాము. ఒకవేళ రేపు కూడా ఆమె విచారణకు హాజరుకాకపోయినా.. ఏవైనా సాకులు చెప్పినా రకుల్‌కి నాన్‌ బెయిలబుల్‌ సమన్లు జారీ చేస్తాం’ అని ఎన్‌సీబీ అధికారులు హెచ్చరించారు. దాంతో రకుల్‌ సమన్లు అందినట్లు ప్రకటించింది