మావోల అలజడి నేపధ్యంలో కూంబింగ్

Spread the love

High Alert in Kaleswaram Project

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 21న కాళేశ్వర ప్రారంభోత్సవాన్ని పండగలా నిర్వహించబోతోంది కేసీఆర్ సర్కార్. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం అంతగా లేనప్పటికీ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించవచ్చని నిఘా వర్గాల సమాచారం. చత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు వచ్చారని రాష్ట్ర అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ హై అలర్ట్ ప్రకటించారు. గ్రేహౌండ్స్, స్పెషల్ ఫోర్స్‌ను పంపి భద్రతను కట్టుదిట్టం చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో 4వేల మందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇప్పటికే చేరుకున్న దళాలు కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మెటల్ డిటెక్టర్లు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ పంప్ హౌజ్, ప్రాణహిత పరిసరాల్లోని గ్రామాలు, ఏటూరునాగారం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలూ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *