ఆర్టీసీ కార్మికులతో చర్చించాలన్న హైకోర్టు

High Court directs to go for discussions with RTC workers

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీని విలీనం చేయలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పొరేషన్లు.. ముందుకు వస్తాయన్నారు. అయితే ప్రజల ఇబ్బందులను మాత్రమే తమ దృష్టికి తేవాలని  హైకోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రైవేట్‌ వ్యక్తులతో ఆర్టీసీ బస్సుల్ని నడిపించడం వల్ల.. ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్‌ తరపు లాయర్‌ అన్నారు. ఇప్పటికిప్పుడు శిక్షణ పొందిన డ్రైవర్లు.. ఎలా దొరుకుతారని న్యాయస్థానం ప్రశ్నించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పై హైకోర్టు విచారణ జరిగింది.ప్రైవేట్ వ్యక్తుల తో ఆర్టీసీ బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్ దాఖలు చేసిన దాని పై కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రభుత్వం యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు అని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ కార్మికులు నిరసనలు తెలిపేం దుకు అనేక మార్గాలు ఉన్నా యని సమ్మె చేయడం విరమిం చుకోవాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఆఖరి అస్త్రం ఉపయోగించినా ఫలితం లేదు కదా? అని హైకోర్టు కార్మిక సంఘాలను ఉద్దేశించి ప్రశ్నించింది. ముందు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 5వ తేదీ నుంచి సమ్మె జరుగుతున్నా విరమింపజేయడానికి..ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులతో తక్షమనే చర్చలు ప్రారంభించాలని , పూర్తి స్థాయి ఎండీని నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతే కాదు రెండు రోజుల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది .

tags : TSRTC, RTC strike, telangana RTC news, RTC JAC, high court, hearings, talks

 తెలంగాణా కోరుకుంది ఇందుకేనా 

ముఖ్యమంత్రి పెద్ద నేరానికి పాల్పడ్డాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *