ఎన్ని నోటీసులిచ్చారు? ఎన్ని కూల్చారు?

5
High Court Fired Ghmc
High Court Fired Ghmc

High Court Fired Ghmc

జీహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అక్రమ నిర్మాణాల నియంత్రణ సరిగ్గా లేదంటూ నిప్పులు చెరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు అక్రమంగా కట్టడాలు వెలుస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ ప్రశ్నలు సంధించింది. అక్రమ నిర్మాణాల విషయంలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. తమ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ కూకట్ పల్లికి చెందిన ఒక వ్యక్తి పిటిషన్ వేయగా.. దాన్ని హై కోర్టు పిల్ గా మార్చడం విశేషం.

* అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రాగానే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీచేయడం, నిర్మాణదారులు కింది కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం సర్వసాధారణమైంది. అట్టి మధ్యంతర ఉత్తర్వుల నిలుపుదల ఆదేశాల్ని ఎత్తివేయడానికి అధికారులు కోర్టుల్లో వెకేట్ పిలిషన్లు వేయరు. అక్రమ నిర్మాణాల్ని పూర్తి చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోరు. ఆ తర్వాత ప్రభుత్వాలేమో బీఆర్ఎస్ వంటి పథకాల్ని ప్రవేశపెడుతుంటాయి. ఫలితంగా, ప్రణాళికాబద్ధంగా కాకుండా విస్తరణ జరిగిపోతుంది. అయితే, ఇది సరైన విధానం కానే కాదంటూ హై కోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

* 2020లో కొవిడ్ కారణంగా అక్రమ నిర్మాణాలపై తనిఖీలు సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలకు నోటీసులిచ్చారో చెప్పాలని అధికారుల్ని ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వంటి వివరాలతో ఆరు జోన్లలోని 30 సర్కిళ్లకు సంబంధించి పట్టిక రూపంలో వేరువేరుగా నివేదికను అందజేయాలని జోనల్ కమిషనర్లకు హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.

High Court Latest News