మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Spread the love
high court green signal for municipal elections

తెలంగాణలో  మరో ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. ఈ ఎన్నికలను ఆగస్టు 15లోపే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు హైకోర్టులో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు, నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని కూడా పిటిషనర్లు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా ప్రక్రియను పూర్తి చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది. తాజాగా దానిని తొలగించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే, సుదీర్ఘంగా కోర్టుల్లో ఉన్న కేసులు..వాదనల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు. అయితే, ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల సంఘం తాము ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పు 53 మున్సిపాల్టీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 75 మున్సిపాల్టీల విషయంలో మాత్రం స్టే తొలిగిస్తేనే ఎన్నికలు సాధ్యం అవుతుంది. దీంతో.. ప్రభుత్వం ఆ దిశగా న్యాయ పరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. స్టే తొలిగించిన తరువాత మొత్తంగా 128 మున్సిపాల్టీలకు కలిసి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా కొన్ని నగర పంచాయితీలను ప్రభుత్వం మున్సిపాల్టీలుగా అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రిజర్వేషన్లు..ఓటర్ల లిస్టులో అక్రమాలు.. వార్డుల విభజన పైన కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఇప్పుడు కోర్టు నిర్ణయంతో ప్రభుత్వం తీసుకుబోయే నిర్ణయం కీలకం కానుంది.ఇక, ఇప్పుడు మిగిలిన న్యాయ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం ఎన్నికలకు సిద్దం అవుతుందా లేదా అనే ఆసక్తి ఇప్పుడు రాజకీయ పార్టీల్లో మొదలైంది. తాజాగా హుజూర నగర్ ఉప ఎన్నిక విషయంలో అధికార.. ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా పోరాటం చేసాయి. దీంతో, ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికలు కావటంతో ప్రభుత్వం సైతం ఆచి తూచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు మాత్రం తాము మున్సిపల్ పోరుకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నాయి.
tags : telangana, muncipal elections, high court, judgement, green signal, cm kcr, trs, congress, bjp

చర్చలకు పిలిచే అవకాశం విలీనం మినహా మిగతా అంశాలపై చర్చ

అంతా రేవంత్ ఇష్టమేనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *