ఎన్కౌంటర్ మృతుల మృతదేహాలు ఎలా ఉన్నాయని ఆరా తీసిన కోర్టు

High Court Inquiry About Dead Bodies

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో దిశను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల మృతదేహాలు ఇంకా గాంధీ ఆసుపత్రి లోనే ఉన్నాయి. ఇప్పటికే మృతదేహాలు పాడవకుండా అత్యంత ఖరీదైన ఎంబాల్మింగ్ ఇంజెక్షన్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా దిశ కేసులో పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కు గురైన నలుగురు నిందితుల మృతదేహాలు ఎలా ఉన్నాయంటూ హైకోర్టు ఆరా తీసింది. మృతదేహాల పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శనివారం హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు జరిగాయి. మృతదేహాలకు సంబంధించిన కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలిపిందని చీఫ్ జస్టిస్‌ వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలని అనుకుంటున్నామని న్యాయస్థానం చెప్పింది. రీపోస్ట్‌మార్టం అవసరం లేదని, ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయిందని ప్రభుత్వం పేర్కొంది. తదుపరి విచారణను శనివారానికి కోర్టు వాయిదా వేసింది. రేపు మరోమారు కేసు విచారణ జరగనుంది. గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ మృతదేహాల పరిస్థితిపై కోర్టుకు వివరాలు అందించనున్నారు.

tags : Disha Case, Encounter, Accused Died, Dead Bodies, Gandhi Hospital. High court, supreem court, Repost Mortum

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *