మున్సిపోల్స్ పై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు

Spread the love
High Court questioned telangana on municipal elections

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్లపై  హైకోర్టులో విచారణ కొనసాగుతుంది . నేడు జరిగిన విచారణలో ప్రభుత్వమపై సీరియస్ అయ్యింది హై కోర్టు . ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి  పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమని చెప్పింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసినట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో మున్సిపాలిటీ ఎన్నికలపై విధించిన స్టే కు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించినట్టుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.హైకోర్టు ఆదేశిస్తే అన్ని మున్నిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టు దృష్టికి తెచ్చింది. ఇక  కోర్టు తీర్పు ఆధారంగానే ఎన్నికలను ఎప్పుడు జరపాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్న అంశంపై ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.

ఇక నేడు జరిగిన విచారణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి 109 రోజుల సమయం అడిగిన ప్రభుత్వం ఇప్పుడు 8 రోజుల కు ఎలా కుదిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికల కు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కోర్ట్ కు  తెలిపిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావును ఏ ప్రాతిపదికన వార్డుల విభజన ,రిజర్వేషన్ల ప్రక్రియ చేసారని ప్రభుత్వం ను ప్రశ్నించిన హైకోర్టుకు వార్డుల విభన,రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం జీవో నెంబర్ 78 ద్వారా  పూర్తి చేశామని సమాధానం చెప్పారు. అంతే కాదు పాత ఆర్డినెన్స్ ద్వారా నే మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం .అయితే తెలంగాణ ప్రభుత్వం నూతన ఆర్డీనెనన్స్ తీసుకొచిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళారు.  ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్డినెన్స్ వివరాలు కోర్టుకు తెలపాలని ప్రభుత్వానికి  హైకోర్టు ఆదేశం జారీ చేసింది. శుక్రవారం నూతన ఆర్డినెన్స్  కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను శుక్రవారం కు వాయిదా వేస్తున్నట్టు  హైకోర్టు పేర్కొంది.

telangana municipal elections latest news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *