కరోనా కట్టడిపై హైకోర్టు సీరియ‌స్‌

19

High Court serious on Corona Control Steps by TS Govt.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జ‌రిపింది. కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు ప్ర‌భుత్వం నివేదిక స‌మ‌ర్పించింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్రభుత్వం పూర్తిగా రాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టిందని అసంతృప్తి చెందింది. ఆర్టీ పీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది.

పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని తెలిపిన ఏజీ కోర్టుకు విన్న‌వించ‌గా.. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్టుంటే.. ఇంకా నెమ్మదిగా పెంచడమేంటన్న హైకోర్టు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని ఆదేశించింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాల‌ని సూచించింది. కరోనా పాజిటివ్, మరణాల రేటును వెల్లడించాల‌ని తెలియ‌జేసింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాల పై విస్తృత ప్రచారం చేయాల‌ని సూచించింది. అనాథ‌, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియ‌జేసింది. కరోనా నిబంధనలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని చెప్పింది. కరోనా నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాల్ని స‌మ‌ర్పించాల‌ని.. 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here