కాకినాడలో హై టెన్షన్

High tension in Kakinada

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన చేపట్టారు. ఇక పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా కాకినాడలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇక వైసీపీ దాడుల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్ కాకినాడ పర్యటన ముఖ్య ఉద్దేశం. దీంతో పవన్ ని చూసేందుకు, తమ బాధలు చెప్పుకునేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా వస్తున్న నేపథ్యంలో ఏదైనా జరగరాని ఘటన జరుగుతుందని పోలీసులు కట్టడి చేసే భాగంలో అక్కడ 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఇటీవల ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు తీవ్రతరంగా మారాయి. ముఖ్యంగా అయన పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై జనసేనులు ఆగ్రహంతో ఉన్నారు. అందులోభాగంగానే ద్వారంపూడిని అరెస్టు చేసే వరకు ఉద్యమిస్తామని జనసేన శ్రేణులు తేల్చిచెప్పారు. ఒక రాజధాని వద్దు…మూడు రాజధానులు ముద్దు అన్న నినాదంతోఎమ్మెల్యే ద్వారంపూడి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేష్‌పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ద్వారంపూడి వ్యాఖ్యలపై మండిపడ్డ జనసైనికులు ర్యాలీ చేపట్టగా ఈ సమయంలో జనసైనికులకు వైసిపి నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసేన నాయకులు, కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్ కాకినాడ వెళ్లనున్నారు. ఇదే విషయంపై భవిష్యత్ కార్యచరణపై నాయకులతో పవన్ చర్చించనున్నారు.

High tension in Kakinada,Pawan Kalyan Kakinada Tour,Janasena vs YCP,MLA Dwarampudi comment,Kalyan In Kakinada,144 Section In Kakinada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *