ఆ రెండు సినిమాలు ఇక్కడ సూపర్ హిట్టు  

hit and palasa super hit

వెండితెర వెలవెలబోతోంది. కరోనా కాటుకు అన్ని సినిమా పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ మాత్రమే కాదు.. రెగ్యులర్ షూటింగ్స్ తో బిజీగా ఉంటూ.. సరికొత్త ఎపిసోడ్స్ తో ఎంటర్టైన్ చేసే సీరియల్స్ సైతం చిన్నబోయాయి. అయినా బుల్లితెర వెలుగుతోంది. అలాగని టివి కాదు. స్మార్ట్ స్క్రీన్ అనుకోవచ్చు.  యస్.. ప్రస్తుతం ఆన్ లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓ రేంజ్ లో ఆదరణ వస్తోంది. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుని కరోనా కాటుకు బలైన రెండు సినిమాలకు ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ లో సూపర్ హిట్ టాక్ వస్తోంది.

గత నెలలో విడుదలైన పలాస 1978..  సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఆడియన్స్ నుంచి రా అండ్ రియలిస్టిక్ అనే మాటలు వినిపించాయి. అయితే  పోస్టర్ వాల్యూ స్ట్రాంగ్ గా లేకపోవడం.. అంతా కొత్తవాళ్లు కావడంతో మంచి ఓపెనింగ్స్ అయితే రాలేదు. కానీ మౌత్ టాక్ తో థియేటర్స్ పెరుగి.. అన్ని వర్గాల ఆడియన్స్ కు దగ్గరవుతోన్న టైమ్ లో వచ్చిన కరోనా పలాస పై ఎఫెక్ట్ చూపించాయి. దీంతో అనివార్యంగా సినిమా థియేటర్స్ నుంచి అవుట్ అయిపోయింది. కొన్ని వర్గాల ప్రజలను రిప్రజెంట్ చేస్తూనే ఓ తమిళ్ సినిమా చూస్తున్నామా అనే భావనలో అత్యంత రియలిస్టిక్ గా కనిపించిన ఈ మూవీ 1978లో ప్రారంభం అయిన ప్రధాన భాగం అంతా ఓ రెండున్నర దశాబ్దాల పాటు సాగుతూ చివరికి మనం ఇప్పుడున్న కాలంలో ఎండ్ అవుతుంది. మామూలుగా ఇలాంటి సినిమాలు మనం తమిళ్ లో చూస్తాం. అందుకే తెలుగు ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది.

కానీ కరోనా ఎఫెక్ట్ తో అందరూ చూడలేకపోయినా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అదరగొడుతుందీ చిత్రం. ఇక దీంతో పాటు వచ్చిన మర సినిమా హిట్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు థియేటర్స్ లో ఆదరణ పెరుగుతోన్న టైమ్ లోనే ఆగిపోయింది. ఇప్పుడు హిట్ కూడా డిజిటల్ ఫార్మాట్ లో సూపర్ హిట్ అనిపించుకుంటోంది. మామూలుగా ఏదైనా సినిమా విడుదలైన తర్వాత మనకు ఫేస్ బుక్ లో, యూ ట్యూబ్ లో రివ్యూస్ కనిపిస్తుంటాయి. మంచి సినిమా అయితే దాని గురించి కాస్త ఎక్కువమంది రాస్తుంటారు. ఇప్పుడు పలాస, హిట్ సినిమాల గురించి కూడా ఇదే టైప్ లో ఫేస్ బుక్ లో రివ్యూస్ కనిపిస్తుండటం విశేషం. కరోనా ఎఫెక్ట్ తో జనమంతా ఇళ్లకే పరిమితం కావడం.. చాలా మందికి స్మార్ట్ ఫోన్స్ ఉండటం.. వేరే ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో అనివార్యంగా ఈ స్మార్ట్ స్క్రీన్ కే ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ మధ్య కాలంలో వచ్చి.. చూద్దాం అనుకునేలోపే వెళ్లిపోయిన పలాస, హిట్ సినిమాలకు చాలా ఆదరణ కనిపిస్తోంది. రెండూ డిఫరెంట్ జానర్స్ మూవీస్.అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చుఅనుకునేలా ఉంటాయి. అందుకే ఆ రెండూ బుల్లితెరపైన బంపర్ హిట్ అనిపించుకుంటున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *